Ascension


ఆరోహణము




 

అపొస్తలుల కార్యములు 1:9

ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు.అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది.


లూకా సువార్త 24:50- 51

50 ఆ తర్వాత వారిని అక్కడి నుండి బేతనియ దాకా తీసుకు పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. 51 వారిని ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. 


అపొస్తలుల కార్యములు 1:9

10 ఆయన వెళ్తూ ఉండగా  వాళ్ళు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నారు. అకస్మాత్తుగా తెల్లని బట్టలు వేసుకొన్న యిద్దరు వ్యక్తులు వారి ప్రక్కన నిలుచొని వాళ్ళతో, 11 గలిలయ నివాసులారా! ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిలుచున్నారు? మీ నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు పరలోకానికి వెళ్ళినట్లే మరల తిరిగి వస్తాడు” అని అన్నారు.


మార్కు 16:19

యేసు ప్రభువు వాళ్ళతో మాట్లాడిన తరువాత దేవుడు ఆయనను పరలోకంలోకి పిలుచుకొన్నాడు అక్కడ యేసు ప్రభువు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు.


యోహాను సువార్త 16:28

నేను తండ్రి దగ్గర నుండి ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను” అన్నాడు.


యోహాను సువార్త 14:2

నా తండ్రి యింట్లో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అలా లేకపోతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 


1 తిమోతికి 3:16

దైవభక్తిక గురించి పవిత్ర రహస్యం చాలా గొప్పది:ఏ సందేహమూ లేదు. క్రీస్తు మానవ శరీరంతో ప్రత్యక్షమయ్యాడు.దేవుడు ఆయన్ని నీతిమంతుడిగా తీర్పుతీ​ర్చాడుఆయనను దేవదూతలు చూశారు.రక్షకుడని దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు.ప్రజలు ఆయనను విశ్వసించారు.మహిమతో ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు.


యోహాను సువార్త 20:17

యేసు ఆమెతో, “నేనింకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నాకు మీకు తండ్రి, దేవుడు అయినటువంటివాని దగ్గరకు వెళ్తున్నానని చెప్పు” అని అన్నాడు..


యోహాను సువార్త 7:33

యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేను ఇంకా కొద్దికాలము మాత్రమే మీతో ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపినవాని దగ్గరికి వెళ్ళిపోతాను. 


యోహాను సువార్త 14:12

నేను మీతో నిజం చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసిన కార్యాలు చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప కార్యాలు  చేస్తాడు. ఎందుకంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.


యోహాను సువార్త 6:62

మనుష్యకుమారుడు, తాను ఇంతకు ముందున్న చోటికి ఆరోహణం కావడం చూస్తే మీరెమంటారు?


అపొస్తలుల కార్యములు 2:33

యేసు పరలోకానికి ఎత్తబడినాడు. ఇప్పుడు యేసు దేవునికి కుడిప్రక్కన ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను యేసుకు ఇచ్చాడు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసింది పరిశుద్ధాత్మయే. ఏసు ఇప్పుడు ఆ ఆత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు వింటున్నది, చూస్తున్నదీ.