Almighty in Bible
దేవుడు
1 దినవృత్తాంతములు 29:11
11 యెహోవా, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు.
యిర్మీయా 32:26
27 చూడు! నేను యెహోవాను. సమస్త మానవాళికి దేవుణ్ణి. చెయ్యడానికి అసాధ్యమైనది ఏదైనా నాకు ఉందా ?
లూకా సువార్త 1:37
37 దేవునికి అసాధ్యమనేది ఏమీ లేదు అని ఆమెతో చెప్పాడు.
ప్రకటన గ్రంథము 1:8
భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉండేవాడు. సర్వశక్తి గలవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును నేనే” అని అన్నాడు.
కీర్తనల గ్రంథము 91:1-2
1 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
2 ఆయనే నా క్షేమ స్థానం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.
కీర్తనల గ్రంథము 80:19
సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.నీ ముఖకాంతి మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము
యిర్మీయా 32:17
17 అయ్యో! ప్రభువైన యెహోవా! చూడు! కేవలం నీవు నీ గొప్ప శక్తీతోను, ఎత్తిన నీ చేతితోనూ భూమ్యాకాశాలను సృష్టించావు. నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు.
కీర్తనల గ్రంథము 145:3
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
1 దినవృత్తాంతములు 29:12
12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే.
రోమీయులకు 8:38-39
38 చావుగాని, బ్రతుకుగాని, దయ్యాలుగాని, దేవదూతలు గాని, భవిష్యత్తుగాని, ప్రస్తుతం గాని, మరే శక్తులుగాని
39 అగాధంగాని, ఎత్తుగాని, సృష్టిలో ఉన్న మరేదైనాసరే మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్నదేవుని ప్రేమ నుండి మనల్ని విడదీయలేవని నేను కచ్చితంగా చెప్పగలను.
రోమీయులకు 1:20
20 కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టించబడిన నాటినుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు.కనుక వారు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
కీర్తనల గ్రంథము 24:1
1 భూమి, పైన ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే. ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
ఎఫెసీయులకు 6:10
10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్ని ఇస్తుంది ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది.
1 యోహాను 4:4
4 బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉన్నవారికన్నా గొప్పవాడు. .
దానియేలు 2:22
22 ఆయన గుప్తంగా ఉండే విషయాలను, రహస్యాలను వెల్లడి చేశాడు. పాతాళంలో జరిగే సంగతులు ఆయనకు తెలుసు, ఆయన చుట్టూ నిత్యం వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది.
1 తిమోతికి 1:17
17 చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ, ఘనత చిరకాలం కలుగునుగాక! ఆమేన్.
1 సమూయేలు 2:7
7 యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు మరికొంతమందిని ధనవంతులుగా చేస్తాడు.పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే.
యెహెజ్కేలు 34:26
26 నేను వాళ్ళను దీవిస్తాను. నా పర్వతం చుట్టూ ఉన్న స్థలాలను దీవిస్తాను. సరైన కాలాల్లో వానలు కురిపిస్తాను. దీవెనకరమైన జల్లులు పడతాయి.
కీర్తనల గ్రంథము 139:4
యెహోవా, నా మాటలు నా నోటిని దాటక మునిపే నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
మార్కు సువార్త 14:36
36 ఆయన, “ అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు
యోబు గ్రంథము 1:12
12 అప్పుడు యెహోవా ఇదిగో అతనికి ఉన్నదంతా నీ ఆధీనంలో ఉంచుతున్నాను. అతనికి మాత్రం నువ్వు ఎలాంటి హానిచేయకూడదు అని అపవాదికి చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్ళిపోయాడు.
0 Comments