Blameless

                                                               నిందలేని


కీర్తనల గ్రంథము 15:2-3

2 అతడు యథార్థమైన ప్రవర్తన కలిగి, న్యాయమైనది చేస్తూ, హృదయంలోనుండి సత్యం పలుకుతాడు.

3 అతడు నాలుకతో అపనిందలు చెప్పడు. ఇతరులకు కీడు చెయ్యడు తన పొరుగు వారిని కించపరచడు.


యాకోబు 3:2

2 మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాము. తాను ఆడే మాటల్లో ఏ తప్పూ చేయనివాడు పరిపూర్ణుడు. అలాంటివాడు కళ్ళెం వేసి తన శరీరాన్ని అదుపులో వుంచుకోగలడు.


ఫిలిప్పీయులకు 2:14-16

14 మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. 

15 అప్పుడు మీరు నిష్కళంకులై మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులుగా నీతి లేకుండా జీవిస్తున్న వీరి మధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని బిడ్డలుగా ఉంటారు. మీరు వాళ్ళ మధ్య ఆకాశంలోని నక్షత్రాల్లా ప్రకాశిస్తారు.

 16 మీరు జీవంగల దైవసందేశాన్ని ప్రకటిస్తున్నారు. కాబట్టి క్రీస్తు వచ్చిన రోజున మీ విషయంలో గర్వించటానికి నాకు ఆస్కారం ఉంటుంది. నా కృషి, సాధన వ్యర్థం కాలేదని ఋజువౌతుంది.


కొలొస్సయులకు 3:14

14 అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది పరిపూర్ణమైన బంధాన్నిసంపూర్ణమైన ఐక్యతను కలుగజేస్తుంది.


రోమీయులకు 12:2

 2 ఇక నుంచి ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అనంతరం మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, పరిపూర్ణమైనదనీ  ఉత్తమమైనదనీ, అది ఆనందం కలిగిస్తుందనీ,  గ్రహిస్తారు!


1 థెస్సలొనీకయులకు 5:15

15 కీడు చేసిన వారికి తిరిగి కీడు చేసే వాళ్ళను గమనిస్తూ వారిని అలా చేయనీయకుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి ఇతరుల పట్ల దయచూపుతూ ఉండండి.


1 కొరింథీయులకు 1:10

10 సహోదరులారా, మీరందరూ మన ప్రభువు యేసు క్రీస్తు నామములో నేను వేడుకునేది ఏమనగా మీ మీరందరూ ఏక భావంతో మాట్లాడుకుంటూ, మీలో మీకు విభేదాలు రానీయకుండా చూసుకోండి. , ఒకే అభిప్రాయంతో ఒకే మనసుతో కలిసి మెలసి ఉండండి.


కీర్తనల గ్రంథము 18:30

30 దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం. ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు.


కీర్తనల గ్రంథము 119:1

1 ఎవరి మార్గాలు పవిత్రంగా ఉంటాయో  యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు నడుచుకుంటారో వారు ధన్యులు.


యోహాను సువార్త 16:24

 24 ఇంత కాలం మీరు నా పేరిట ఏమీ అడుగలేదు. ‘అడగండి; మీరడిగింది మీకు లభిస్తుంది’ అప్పుడు మీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది.


యోబు గ్రంథము 23:10-11

10 కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు. ఆయన నన్ను పరీక్షించడం పూర్తయినప్పుడు నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. నేను స్వచ్ఛమైన బంగారంలా ఉన్నట్టు ఆయన చూస్త్తాడు

11 నేను ప్రతినిత్యం దేవుడు కోరిన మార్గములోనే నడిచాను.దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు.


యాకోబు 1:27

27 వితంతువుల్ని అనాథుల్ని,  కష్టాల్లో ఆదుకోవడం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండడం

ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి. స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.


సామెతలు 2:7

7 యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గము గుండా తప్పిపోకుండా నడుచుకునే వారందరికీ ఆయన రక్షణ కలుగజేస్తాడు.


మత్తయి సువార్త 19:21

21 యేసు, “నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవారికివ్వు! అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని సమాధానం చెప్పాడు.


2 సమూయేలు 22:31

31 దేవుని మార్గము దోషరహితమైనది; యెహోవా మాట పొల్లుపోనిది. తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు.


యాకోబు 1:17

17 ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్టమైన వరానికి పరలోకమే మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. 


హెబ్రీయులకు 5:9

9 పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్న వారందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు. 


ద్వితీయోపదేశకాండమ 18:13

13 మీరు మీ యెహోవాా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. 


2 సమూయేలు 22:21

21 నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు.


2 సమూయేలు 22:24

24 దేవుని ముందర నేను దోషిని కాను;  పాపానికి నేను దూరంగా ఉంటాను!


1 రాజులు 8:61

61 మన దేవుడైన యెహోవాకు మీరంతా చెందియున్నారు. కావున మన దేవుడైన యెహోవాకు విధేయులై యుండాలి. ఆయన న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను మీరంతా తప్పక అనుసరించాలి. మీరిప్పుడు చేస్తున్నట్లు భవిష్యత్తులో కూడ ఆయన మార్గాన్ని మీర నుసరించాలి.”


కీర్తనల గ్రంథము 37:18

18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.

వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.


కీర్తనల గ్రంథము 37:18

18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు. వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.