Santa Claus
     
                  శాంతా క్లాజ్



క్రిస్మస్ వచ్చిందంటే 'కాంటాక్లాజ్' తాత వచ్చి, బహుమతులెన్నో ఇస్తాడన్న ఆశతో ఇంటి ముందు ఒక సంచిని వేలాడదీస్తారు కొంతమంది పిల్లలు. పిల్లలు ఎంతో ఇష్టపడే 'శాంటాక్లాజ్' తాత వెనక కూడా ఒక కథ ఉంది. టర్కీలోని పటారా నగర ప్రాంతంలో క్రీ.శ. 280 లో జన్మించిన 'సెయింట్ నికోలస్' అనే వ్యక్తినే 'కాంటాక్లాజ్గా భావిస్తారు యూరప్ ప్రజలు. పేదవారి కోసం, బాధల్లో ఉన్న ప్రజల కోసం తన ఆస్తి మొత్తాన్ని ఖర్చు చేశాడాయన. జీవితమంతా ఇతరులకు సహాయం చేస్తూనే గడిపాడు నికోలస్. తినడానికి తిండి కూడా పెట్టలేని ఒక తండ్రి డబ్బుల కోసం తన ముగ్గురు కుమార్తెలను  అమ్ముతుంటే నికోలస్ వచ్చి ఆదుకున్నాడని, వారి పెళ్లిళ్లకు అవసరమైన డబ్బు కూడా ఇచ్చాడని చెబుతారు. ఇలాంటి పనులే 'నికోలస్కు పిల్లల ఆప్తుడు గా పేరు తెచ్చిపెట్టాయి.ఆయన మరణించిన డిసెంబర్ 6ను నికోలస్ సంస్మరణ దినోత్సవంగా జరుపుతుంటారు యూరప్ ప్రజలు.నికోలస్ చనిపోయినా ఆయన ఆత్మ 18వ శతాబ్ది చివరి దాకా ఆరు దుప్పులు ఉన్న బండిపైన వచ్చి పిల్లలకు కావాల్సిన బొమ్మలు పంచి పెట్టాడని డచ్ ప్రజలు విశ్వసీస్తారు. 'నికోలస్ ను సింటర్ క్లాస్' అని డచ్ భాషలో ముద్దుగా పిలుచుకునేవారు. ఇదే కాలక్రమేణా 'శాంటాక్లాజ్' గా మారిందట. యుద్ధంలో పాల్గొనే సైనికుల కుటుంబాలకు అవసరమైన వస్తువులను, వారి పిల్లలకు ఆడుకునే  బొమ్మలను ఇచ్చేందుకు 'ది సాల్వేషన్ ఆర్మీ' సభ్యులు 'కాంటాక్లాజ్' వేషంలో వీధులలో తిరిగి విరాళాలు సేకరించేవారు. అదే వేషంలో వెళ్లి పేద సైనిక కుటుంబాలకు దుస్తులు, బొమ్మలు పంచేవారు. 
'సెయింట్ నికోలస్' గురించి తెలియని పిల్లలు కూడా ఈ సభ్యులనే బహుమతులు తీసుకొచ్చే 'కాంటాక్లాజ్' తాతగా భావించేవారు. అలా అలా 'శాంటాక్లాజ్' సంప్రదాయం స్థిరపడిపోయింది