Miracles in Bible

                    అద్భుతాలు




మార్క 10:27                                                                                                                             
యేసు వారి వైపు గా చూసి “మానవునికి ఇది అసాధ్యమైనపని కాని దేవుడికి అన్నీ సాధ్యమే!”అన్నాడు                                                                                                            

మార్కు సువార్త 9:23

“నీవు విశ్వాసం ఉంచగలిగితే  విశ్వాసమున్న వానికి ఏదైనా సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.


యిర్మీయా 32:27

చూడు! నేను యెహోవాను. సమస్త మానవాళికి దేవుణ్ణి.

యిర్మీయా నాకు అసాధ్యమైనది ఏది  లేదని నీకు తెలుసు.


లూకా 8:50

ఇది విని యేసు యాయీరుతో భయపడకు విశ్వాసం కలిగి ఉండు ఆమెకు నయమైపోతుంది అని అన్నాడు.


లూకా 1:37

దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.


కీర్తనల గ్రంథము 139:13

యెహోవా నా శరీరమంతటినీ నీవు చేశావు.నేను  నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.


కీర్తనల గ్రంథము 139:14

నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం ఆశ్చర్యకరమైనది  అద్భుతమైనది. నా జీవితం గురించి నీకు బాగా తెలుసు.


మత్తయి సువార్త 17:20

యేసు మీలో దృఢమైన విశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేక పోయారు మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అని అనగానే అది వెళ్ళిపోతుంది మీకు అసాధ్యమనేది ఉండదు అని అన్నాడు.


లూకా సువార్త 9:16-17

అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ  తీసుకుని ఆకాశం వైపు చూసి వాటిని దీవించి విరిచి ప్రజలకు వడ్డించమని శిష్యులకు అందచేసాడు

17 వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లోకి ఎత్తారు.


కీర్తనల గ్రంథము 9:1

హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా నీవు చేసిన అద్భుతకార్యములన్నింటిని గూర్చి నేను చెబుతాను.


మత్తయి సువార్త 21:21

యేసు ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు అంత మాత్రమే కాదు ఈ కొండతో ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది


మార్కు సువార్త 6:49

ఆయన శిష్యులు ఆయన నీటిమీద నడవడం చూసి దయ్యం అనుకొని భయపడి పెద్దగా కేకలు వేసారు.

50 వెంటనే యేసు వారితో ధైర్యంగా ఉండండి. నేనే భయపడకండి అని అన్నాడు.


అపొస్తలుల కార్యములు 22:7

నేను నేల మీద పడి ‘సౌలూ సౌలూ,నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావని నాతో ఒక స్వరం పలకడం విన్నాను


అపొస్తలుల కార్యములు 1:9

ఆ విధంగా చెప్పాక వారి కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. అప్పుడు ఒక మేఘం అక్కడికి వచ్చి వారి కంటికి  కనబడకుండా ఆయనను తీసుకొని వెళ్ళిపోయింది.


అపొస్తలుల కార్యములు 4:31

వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించారు.


యెషయా గ్రంథము 7:14

కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి ఒక కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది.


యోహాను సువార్త 20:8

సమాధి దగ్గరకి ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోనికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు

9 అయితే ఆయన మరణించిన వారి నుండి బతికి లేవడం తప్పనిసరి అన్న లేఖనం వారింకా గ్రహించలేదు.


మత్తయి సువార్త 1:22

22-23 ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్య గర్భవతియై మగ శిశువుకు జన్మనిస్తుంది . వారందరూ ఆయననూ  ఇమ్మానుయేలు అని పిలుస్తారు” ఇది నిజం కావటానికే ఇలా జరిగింది


మత్తయి సువార్త 1:18

యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు క్రీస్తు తల్లి మరియకు యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమైనది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది.