Addiction in Bible         

వ్యసనం


1 కొరింథీయులు 6:12

నాకు అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని వాటివల్ల లాభం కలుగదు.అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది కాని నేను దానికి బానిసను కాను


1 కొరింథీయులకు 10:13

13 ఇప్పటి వరకూ మీరు ఎదురుకొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగినవే

దేవుడు నమ్మకస్తుడు భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలగనీయడు. అంతేకాకుండా సహించడానికి వీలుగా ఆ కష్టంతో పాటు దానినుండి తప్పించుకోవడానికి మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.


మత్తయి సువార్త 26:41

మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి! ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనంగా ఉంది అని పేతురుతో అన్నాడు.


రోమీయులకు 6:5-6

5 మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానంలో కూడా మనం ఐక్యం కాగలం. 

6 మన పాపపుజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున ఈ పాప శరీరం బలహీనమై మన మిక పాపానికి దాసులుగాఉండమని మనకు తెలుసు.


గలతీయులకు 5:1

మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు స్వేచ్ఛ కలిగించాడు. కాబట్టి పట్టుదలతో స్థిరంగా నిలబడి ఉండండి. మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.


తీతుకు 2:11-12

11 ఎందుకంటే మానవులకు రక్షణ కలిగించే దేవుని కృప అందరికి ప్రత్యక్షమైంది.

12 అది నాస్తికత్వాన్ని, ఐహిక దురాశల్ని మానివేయుమని బోధిస్తుంది మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ మనోనిగ్రహం కలిగి, క్రమశిక్షణతో, ఆత్మీయంగా ఈ ప్రపంచంలో జీవించుమని బోధిస్తుంది


యాకోబు 4: 7

7 అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి సాతానును ఎదిరించండి అప్పుడు ఆ సైతాను మీ నుండి పారిపోతాడు.


1 యోహాను 2:16

ఈ లోకంలో ఉన్నవన్నీ అంటే శరీరముపై ఆశ నేత్రాశ గర్వం ఈ జీవిత దురహంకారం ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే.


యాకోబు 1:3

నా సోదరులారా! మీకు రక రకాల  పరీక్షలు కలిగినప్పుడు దాన్ని ఆనందంగా భావించండి విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు.


మత్తయి సువార్త 6:13

మేము శోధనకు గురి అయ్యేలా చేయవద్దు.మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.


యోహాను సువార్త 8:34

యేసు జవాబు చెబుతూ మీకు కచ్చితంగా చెబుతున్నాను పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస ఔతాడు.


యోహాను సువార్త 8:36

కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. 


యోహాను సువార్త 8:31-32

31 తనను నమ్మినటువంటి యూదులతో యేసు  “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు.

32 అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసు కుంటారు.అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు.


మత్తయి సువార్త 5:13

మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వారు ఉప్పు తన రుచిని కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. బయట పారేసి కాళ్ళ క్రింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.


1 కొరింథీయులకు 6:19-20

 మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు

20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు.కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి


ఎఫెసీయులకు 5:18

18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.