యేసయ్య నీకు నేను ఏమివ్వగలను 


ఆశ్చర్యకరుడు  కృపా సత్య సంపూర్ణుడు
కష్టనష్టాల్లో కృంగిపోనీయకుండా 
నా పాపముల నుండి నన్ను విడిపించి
నిత్యము నా జీవితంలో కాంతిని నింపిన మహోన్నతుడు.

తన రక్తము చిందించి నాకు రక్షణ ఇచ్చిన దయాళుడు
నా ప్రయాణ అడుగు లోనూ  నేను పలుకు మాటలోనూ  అన్నింట వెనువెంట వుంటూ
కష్టకాలములనుండి నన్ను  కాపాడిన కరుణామయుడు.

అధిక శక్తి సంపన్నుడిగా  అత్యున్నత సింహాసనముపైన  ఆసీనుడై
తన దివ్య శక్తి కనుసైగలతో నన్ను కావలి కాస్తూ
తన వాత్సల్యముతో  సదాకాలము తనతో పాటు  తన రాజ్యంలో జీవించమని దీవించిన
నా తండ్రి యేసయ్యకు  నేనేమివ్వగలను.