Acknowledging God in Bible

               అంగీకారం




యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తియైన ఒప్పుకొనినచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉందురు. 
యోహాను వ్రాసిన 1వ లేఖ 4 : 15. 


దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును. కనుక మన నిరీక్షణను మనము దృఢముగ నిలిపి యుంచుకొందము. 
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 10 : 23. 


తండ్రి అయిన దేవుని మహిమకు. ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువు అని అంగీకరిస్తుంది.
 ఫిలిప్పీయులకు 2:11


మీ హృదయముతో మీరు నమ్ముతారు సమర్థించబడతారు మీ నోటితో మీరు మీ విశ్వాసాన్ని ప్రకటించి రక్షింపబడుతారు.
రోమన్లు ​​10:10


యెహోవా నా  దేవుడు అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.
కాబట్టి ఆయనలోనే నా నమ్మకం ఉంచుతున్నాను.
 
విలాపవాక్యములు 3 24


నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను.
ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది.
ప్రతి నాలుకా దేవుని స్తుతిస్తుంది

రోమీయులకు 14:11


విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్యజీవమును గెలుచు కొనుము. అనేక మంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను ఈ జీవనమునకే పిలిచెను.
తిమోతికి వ్రాసిన 1వ లేఖ 6 : 12.


నీ నోటితో 'యేసు ప్రభువు' అని ఒప్పుకొని, మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయములో నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు.
రోమీయులకు వ్రాసిన లేఖ 10 : 9.


నేను నా పాపములనన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా నా పాపాలను గురించి నేను నీతో చెప్పుకొన్నాను.నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు
.
కీర్తనల గ్రంథము 32:5


ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన సైన్యములకు అధిపతియైన ప్రభువుమహిమాన్వితుడైన ప్రభువు ఆయనే.
కీర్తనల గ్రంధము 24 : 10.


విజయం సాధించిన వాళ్ళలా తెల్లని దుస్తులు ధరించండి.జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను  అతణ్ణి నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను.
ప్రకటన గ్రంథము 3:5


కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడికీ తండ్రి లేనట్టే.
కుమారుణ్ణి అంగీకరించే ప్రతి తండ్రికి రక్షణ ఉనట్టే

1 యోహాను 2:23