Christmas celebrations

           క్రిస్మస్ వేడుకలు



రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ (అతను మొదటి క్రైస్తవ రోమన్ చక్రవర్తి) సమయంలో, 336 సంవత్సరములో డిసెంబర్ 25 న క్రిస్మస్ వేడుక మొదటిగా జరిగింది కానీ అది ఆ సమయంలో అధికారిక రోమన్ రాష్ట్ర ఉత్సవం కాదు.

క్రిస్టియానిటీ కొత్తలో ఈస్టర్ ముఖ్యమైన పండగగా ఉండేది. నాలుగవ శతాబ్దంలో చర్చిఅధికారులు జీసస్ పుట్టిన రోజును సెలవురోజుగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. బైలిల్ లో జీసస్ పుట్టిన తేదీ గురించి ఎక్కడా చెప్పలేదు. కాని కొన్ని ఆధారాల ప్రకారం స్ప్రింగ్ సీజన్ లో జీసస్ పుట్టుక జరిగింది. మొదటిగా డిసెంబర్ 25 ను పోప్ జూలియస్ జీసస్  పుట్టినరోజుగా ఎంచుకుని పాగాన్ శాటర్నేలియా ఫెస్టివల్‌గా పండగ చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో ఈ పండగను ఆ ప్రాంతంలోనే జరుపుకునేవారు, తర్వాత ఈ ఆచారం 482 కల్లా ఈజప్టుకి, తర్వాత ఆది శతాబ్దంలో ఇంగ్లాండుకి  విస్తరించింది. ఎనిమిదవ శతాబ్దం చివరికల్లా క్రిస్మస్ వేడుకలు స్కాండినేవియా మొత్తానికి పాకాయి.ఇప్పటికి గ్రీక్, రష్యన్ సంప్రదాయ చర్చల్లో, డిసెంబర్ 25 తర్వాత 13 రోజులకు జరుపుకుంటారు. ఆ పండుగను ముగ్గురు రాజుల పండగగా జరుపుతారు. ఎందుకంటే ముగ్గురు తెలివైన రాజులు జీసస్‌ను కనుకున్నారు కాబట్టి వారి పేరు మీదుగా పండగ జరుపుకుంటారు. 19 వ శతాబ్దంలో అమెరికన్లు కుటుంబానికి సంబంధించిన పండుగగా జరుపుకోవడం ప్రారంభించారు. 1870 నుంచి అమెరికాలో క్రిస్మసన్ను సెలవుగా ప్రకటిస్తున్నారు.