God in Bible 

                 దేవుడు



జెఫన్యా 3:17

17 నీ దేవుడైన యెహోవాా నీ మధ్య ఉన్నాడు.ఆయన శక్తిమంతుడైన సైనికునిలా ఉన్నాడు.ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు.ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన నీకు చూపిస్తాడు.ఆయన నీ గురించి సంతోషపడతాడు, నీవంటే ఆనందిస్తాడు.విందులో పాల్గొన్న వారివలె అయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు.


యెహొషువ 1:9

9 నేను ఆజ్ఞ ఇచ్చాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు భయపడకు దిగులు పడకు. నువ్వు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.


యెషయా గ్రంథము 41:13

13 నేను నీ దేవుణ్ణి యెహోవాను, నేను నీ కుడిచేయి పట్టుకొన్నాను.నీవు భయపడవద్దు నేను నీకు సహాయం చేస్తాను.అని నేను నీతో చెబతున్నాను.


ద్వితీయోపదేశకాండమ 4:29

29 అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాాను మీ పూర్ణాత్మతో పూర్ణహృదయంతో వెదకితే గనుక  ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు.


కీర్తనల గ్రంథము 73:25

25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకింకేమీ అక్కరలేదు.


కీర్తనల గ్రంథము 56:3

3 నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ము కొంటాను.


కీర్తనల గ్రంథము 56:1

1 దేవా, ప్రజలు నా మీద దాడి చెస్తార గనుక నాకు దయ చూపించుము.వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు.


కీర్తనల గ్రంథము 31:3

3 నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపించి నడిపించు.


ఫిలిప్పీయులకు 4:13

13 నాకు శక్తినిచ్చే యేసు క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను.


1 యోహాను 4:19

19 దేవుడు మొదటగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.


1 యోహాను 4:16

16 దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలుసుకుని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు.


2 సమూయేలు 7:22

22 దేవా యెహోవా నువ్వు అనంతమైన ప్రభావం గలవాడివి. మేము విన్నదాన్ని బట్టి చూసినప్పుడు నీవు తప్ప దేవుడు ఎవరూ లేడు.


హెబ్రీయులకు 3:4

4 ప్రతి ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ     నిర్మించిన వాడు దేవుడే.


కీర్తనల గ్రంథము 34:8

8 యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి.యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.


యెషయా గ్రంథము 60:1

1 లే, ప్రకాశించు! నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.


గలతీయులకు 6:7

7 మోసపోకండి ప్రతి ఒక్కరూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతారు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము.


1 యోహాను 4:20

20 నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెబుతూ తన సోదరుణ్ణి ద్వేషించే వాడు అసత్యమాడుతున్నట్టు. కనిపిస్తున్నసోదరుణ్ణి ప్రేమించలేనివాడు కనిపించని దేవుడిని ప్రేమించలేడు.


1 యోహాను 4:12

12 ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. మనము ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది.


సామెతలు 8:35

35 నన్ను కనుగొన్నవాడు జీవాన్ని సంపాదించుకుంటాడు. యెహోవాా అనుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది.


యెషయా గ్రంథము 55:8

8 నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు.


కీర్తనల గ్రంథము 16:2

2 నేను యెహోవాతో అంటాను. నువ్వు నా ప్రభువు. నీకు వేరుగా నాకు ఏ మంచీ లేదు.


ఫిలిప్పీయులకు 4:4

4 అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి.


1 సమూయేలు 2:2

2 యెహోవా వంటి మరో పరిశుద్ధమైన దేవుడు లేడు.నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.


యాకోబు 4:10

10 ప్రభువు ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.


నిర్గమకాండము 20:12

12 నీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి.


యెషయా గ్రంథము 40:8

8 గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది. కానీ మన దేవుడు పలికిన మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.


కీర్తనల గ్రంథము 62:7

7 దేవునిలోనే నా రక్షణ నా మహిమ. నా ఆశ్రయము నా బలమైన దుర్గం ఆయనలోనే ఉన్నాయి


యిర్మీయా 32:27

27  నేనే యెహోవాను ఈ భూమి పై ప్రతి వానికి నేనే దైవాన్ని. నాకు అసాధ్యమైనది ఏదీ లేదని నీకు తెలుసు.


ప్రసంగి 11:5

5 గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన తల్లి గర్భములో ఎలా పెరుగుతుందో నీకు తెలియదు. అలాగే దేవుడు  ఏంచేస్తాడో నీకు తెలియదు కాని అన్నీ జరిపించేది ఆయనే.


మార్కు సువార్త 12:30

30 నీ బుద్ధి శక్తి  జ్ఞానం సంపూర్ణముగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి నీ సంపూర్ణమైన ఆత్మతో మనస్ఫూర్తిగా ప్రేమించు.


1 యోహాను 5:4

4 దేవుని కారణంగా జన్మించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసము వలన మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించ గలిగాము. 


ద్వితీయోపదేశకాండమ 7:9

9 కాబట్టి యెహోవాాయే మీ  దేవుడనీ తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించే వారందరికీ తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మకమైన దేవుడని గ్రహించాలి. ఆయనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ ప్రత్యక్షంగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి.


ప్రకటన గ్రంథము 1:8

8 భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు. సర్వశక్తి గల సంపన్నుడైన మన ప్రభువైన దేవుడు ఆదియు అంతమును నేనే అని అన్నాడు.


యోహాను సువార్త 1:1

1 సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు.


కీర్తనల గ్రంథము 138:8

8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము. యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.


యెషయా గ్రంథము 28:29

ఇవన్నీ కూడా సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వచ్చాయి, అతని ప్రణాళిక అద్భుతమైనది, అతని జ్ఞానం అద్భుతమైనది.


1 తిమోతికి 2:5

5 దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే.ఆయనే మానవునిగా జన్మించిన యేసు క్రీస్తు.


రోమీయులకు 8:31

31 వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు?


కీర్తనల గ్రంథము 105:4

4 యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి.


1 యోహాను 4:8

8 దేవుడు ప్రేమస్వరూపం గలవాడు. ప్రేమలేని వానికి దేవుడెవరో తెలియదు.


కీర్తనల గ్రంథము 27:4

4 యెహోవాను ఒక్క సంగతి అడిగాను. దాని కోసం చూస్తున్నాను. నేను వెదుకుతున్నాను. ఆయన ఆలయములో ధ్యానం చెయ్యడానికి యెహోవా సౌందర్యాన్ని చూడడానికి  నా జీవితం అంతా నేను యెహోవా సన్నిధిలో నివాసము ఉండాలని అడిగాను.


రోమీయులకు 8:28

28 దేవుణ్ణి ప్రేమించేవారికి  ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిపిస్తాడని మనకు తెలుసు.


కీర్తనల గ్రంథము 124:8

8 భూమినీఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.


కీర్తనల గ్రంథము 33:18

18 యెహోవాను అనుసరించే ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతాడు ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణ ఉంచే వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన అనంతమైన ప్రేమ ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.


ఫిలిప్పీయులకు 2:11

11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు.తండ్రియైన దేవునికి మహిమ కలుగునుగాక


1 యోహాను 4:13

13 దీనివలన మనము ఆయనలో నిలిచి ఉన్నామనీ ఆయన మనలో నిలిచి ఉన్నాడనీ తెలుసుకుంటాం. ఎందుకంటే ఆయన తన ఆత్మను మనకిచ్చాడు


కీర్తనల గ్రంథము 90:2

2 పర్వతాలు ఉనికిలోకి రాకమునుపే భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే ఇప్పటికీ ఎప్పటికీ నీవే దేవుడివి.


కీర్తనల గ్రంథము 46:10

10 నిశ్శబ్దంగా ఉండండి. నేనే దేవుణ్ణి అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.


ఆదికాండము 50:20

20 మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది మనుషుల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు.


యాకోబు 4:4

4 నమ్మక ద్రోహులారా! ప్రపంచంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? ప్రపంచంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు.


ద్వితీయోపదేశకాండమ 4:39

39 కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాాయే దేవుడనీమరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి


ఎఫెసీయులకు 6:10

10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది.


ప్రకటన గ్రంథము 21:3-4

3 సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా ఉంటాడు.

4 వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ వుండదు. అని అన్నది.


కీర్తనల గ్రంథము 127:1

1 యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టే వారు పాటుబడడం వ్యర్ధం. యెహోవా పట్టణానికి కావలిగా ఉండకపోతే దాన్ని కాపలా కాసేవాళ్ళు నిలబడి ఉండడం వ్యర్ధం.


రోమీయులకు 8:37

37 అయినా వీటన్నిటిలో మనల్ని ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణమైన విజయం పొందుతున్నాం. 


యెహెజ్కేలు 38:23

23 అన్యజనులందరూ ఈ రీతిగా నేను యెహోవాానని తెలుసుకునేలా నా పరిశుద్ధతను నా గొప్పతనాన్ని నా మహాత్యమును వారి ఎదుట చూపించి నన్ను నేను హెచ్చించుకుంటాను.


కీర్తనల గ్రంథము 24:1

1 భూమి దాని పై ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.

ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.


జెకర్యా 4:6

6 అతడు నాతో ఇలా అన్నాడు: యెహోవా నుంచి జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది: నీ శక్తి సామర్థ్యముల వలన  నీకు సహాయం రాదు. నీ సహాయం నా ఆత్మ నుండి వస్తుంది. సర్వశక్తిమంతుడైనటువంటి యెహోవా ఆ విషయాలు చెప్పాడు! 


1 యోహాను 4:11

11 ప్రియులారా దేవుడు మనలను చాలా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.


సామెతలు 18:10

10 యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గంలాంటిది.నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు


కీర్తనల గ్రంథము 42:1

1 దాహంగా వున్నాదుప్పి చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు తాగాలని ఆశిస్తుంది. అలాగే దేవా నీకోసం నా ఆత్మ తపించిపోతోంది


రోమీయులకు 10:13

13 ఎందుకంటే ప్రభువు నామములో ప్రార్థన చేసే వారందరికీ పాప విమోచన కలుగుతుంది. 


యిర్మీయా 23:24

24 ఒక వ్యక్తి నాకు నకపడకుండా రహస్య స్థావరంలో దాగటానికి ప్రయత్నించవచ్చు.కాని వానిని చూడటం నాకు తేలిక ఎందువల్లనంటే నేను స్వర్గంలోను, భూమి మీద సర్వత్రా వ్యాపించి వున్నాను!


కీర్తనల గ్రంథము 18:31

31 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుడు తప్ప ఆశ్రయశిల ఏది?


రోమీయులకు 8:16

16 మనం దేవుని పిల్లలమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు.


యోహాను సువార్త 17:3

 3 నీవు మాత్రమే నిజమైన దేవుడవు. నిన్నూ, నువ్వు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడమే అనంత జీవితం.


1 కొరింథీయులకు 1:9

9 తన కుమారుడిను మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహా వారసులగుటకు దేవుడు మిమ్ములను పిలిచాడు. ఆయన నమ్మకస్తుడు.


కీర్తనల గ్రంథము 34:10

10 సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కాని యెహోవాను సమీపించి ప్రార్ధించే వారికి దేనికి కొదవ ఉండదు


2 పేతురు 3:8

8 కాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని మరచిపోకండి. దేవునికి ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగా వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగా ఉంటాయి


కీర్తనల గ్రంథము 67:7

7 దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమి మీద వున్న ప్రతి ఒక్కరూ ఆ దేవుడికి భయపడి ఆయనను గౌరవించెదరు గాక.


 యెషయా గ్రంథము 41:4

4 ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు?ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు?

యెహోవాను నేనే ఈ సంగతులను చేశాను.యెహోవా నేనే మొట్ట మొదటి వాడిని ప్రారంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను. 


1 యోహాను 1:5

5 దేవుడు వెలుగై వున్నాడు.ఆయనలో చీకటి లేనే లేదు ఈ విషయం మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 


మత్తయి సువార్త 17:5

5 అతడు ఇంకా మాట్లాడుతుండగా ఒక కాంతివంతమైన మేఘం ఆ ముగ్గురి వ్యక్తులను కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం పలుకుతూ  ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన పట్ల నాకు అమితమైన ప్రేమ ఉంది. ఈయన నాకు చాలా నచ్చాడు.ఈయన మాట వినండి అని వినిపించింది.


యోహాను సువార్త 6:29

29 దానికి యేసు దేవుడు పంపిన వ్యక్తి పై విశ్వాసముంచడమే దేవుని కార్యాములు చేయడమంటే అన్నాడు. 


కీర్తనల గ్రంథము 90:4

4 నీ దృష్టిలో వేయి సంవత్సరములు గడచిపోయినను ఒక రోజువలె ఉంటాయి. గత రాత్రిలా అవి ఉన్నాయి


జెకర్యా 14:9

9 ఆ సమయంలో యెహోవా ప్రపంచానికంతటికి రాజుగా వుంటాడు. యెహోవా ఒక్కడే. ఆయనకు పేరు ఒక్కటే. 


విలాపవాక్యములు 5:19

19 యెహోవా, నువ్వు నిత్యం పరిపాలిస్తావు. నీ సింహాసనం తరతరాలు ఉంటుంది.


కీర్తనల గ్రంథము 33:12

12 యెహోవా ఏప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు. తనకు సొత్తుగా ఆయన ఎంచుకున్న జనం ధన్యజీవులు.


రోమీయులకు 13:1

1 ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వలన కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే.


ఆదికాండము 1:26-27

26 దేవుడు ఇలా అన్నాడు మన పోలికలతో మన స్వరూపంతో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమిపైన పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికీ ఆధిపత్యం ఉండాలి అన్నాడు. 

27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. స్త్రీనిగా, పురుషునిగా వాళ్ళను సృష్టించాడు.


1 యోహాను 3:24

24 దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిత్యం నిలిచి  ఉన్నాడని మనకు తెలుసు.


దానియేలు 2:22

22 గ్రహించడానికి కష్టతరమైన రహస్యాలు ఆయనకు తెలుసు.చీకటిలో మరుగైన సంగతులు ఆయనకు తెలుసు. ఆయన చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది.


2 కొరింథీయులకు 13:14

14 ప్రభువైన యేసు క్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై యుండునుగాక.


ద్వితీయోపదేశకాండమ 6:4-5

4 ఇజ్రాయేలు ప్రజలారా వినుము మన దేవుడైన  యెహోవా మాత్రమే మనకు దేవుడు.  

5 నీ దేవుడైన యెహోవాాను  నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో ప్రేమించాలి.


2 సమూయేలు 22:32

32 యెహోవాను మించిన దేవుడు లేడు మన దేవుడిలాంటి మరోక అండలేదు.


ఆమోసు 9:6

6 ఆయన ఆకాశాల్లో తన కోసం భవనాలను నిర్మించేవాడు.భూమి పైన తన పునాది వేసినవాడు.సముద్రపు నీరును  వర్షంగా భూమి పై కురిపించేవాడు ఆయనే యెహోవాా.


యోబు గ్రంథము 37:23

23 సర్వశక్తుడైన దేవుడు మహాత్మ్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయాన్ని, నీతిని ఆయన ఏమాత్రం చెరపడు. అందువలన మనుషులు ఆయనపట్ల భయభక్తులు కలిగి ఉంటారు.


యెహెజ్కేలు 36:23

23 మీ మూలముగా ఇతర రాజ్యములలో దూషణకు గురి అయిన నా గొప్ప పేరు ఎంత పవిత్రమో నేను చూపిస్తాను. నేను పరిశుద్దునిగా మీరు నన్ను చూసినప్పుడు నేను యెహోవాాప్రభువునని వారు తెలుసుకుంటారు. ఇదే యెహోవాా ప్రభువు సందేశం.


హొషేయ 13:4

4 మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవాానైన నేనే మీ దేవుణ్ణి.నన్ను తప్ప నీవు ఏ దేవుడినీ గుర్తించ కూడదు.నేను తప్ప వేరే రక్షకుడు లేడు


1 కొరింథీయులకు 2:10

10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.


1 తిమోతికి 1:17

 17 చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక! ఆమేన్.


లేవీయకాండము 22:31

31 మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తూ వాటి ప్రకారం నడుచుకోవాలి. నేను యెహోవాను.