Christmas Tree

క్రిస్మస్ చెట్టు





క్రిస్మస్ చెట్టును అలంకరించే సంప్రదాయం 15 వ శతాబ్ధంలో లివోనియాలోనూ, 16 వ శతాబ్దంలో జర్మనీలోనూ ప్రారంభమైనది .కానీ ఈ సంప్రదాయం 19 వ శతాబ్ద ప్రారంభంలో ప్రాచుర్యం పొందింది. చరిత్ర కధనంగా క్రిస్మస్ చెట్టుని పరిశీలిస్తే ఈ సంప్రదాయం 1781 లో  బెన్షివిక్ అనే సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించిందని కొందరి వాదన. 'జనరల్ ఫెడరిక్ అడాల్ఫ్ రెడిజిల్' అనే సైనికాధికారి ఇచ్చిన క్రిస్మస్ విందులో అతిథులను ఆశ్చర్యపరచడం కోసం 'ఫర్' అనే చెట్టుని కొవ్వొత్తులతో, పండ్లతో అలంకరించారు. ఆ తర్వాత రష్యా లాంటి దేశాల్లోనూ సంపన్న కుటుంబాలవారు క్రిస్మస్ చెట్టుని ఉపయోగించటం మొదలు పెట్టారు 1816 లో 'నస్సావోవిల్ బర్గ్ యువరాణి హెన్ రేటా' క్రిస్మస్ చెట్టుని వియన్నా దేశానికి పరిచయం చేసింది. ఆతర్వాత కాలంలో ఈ సంప్రదాయం ఆస్ట్రియాకి విస్తరించింది. ఫ్రాన్స్ దేశంలోకి 1840 సంవత్సరంలో లో డచ్ వారు ద్వారా ఈ చెట్టు వచ్చింది. బ్రిటన్ దేశంలోకి 19వ శతాబ్ద ఆరంభంలో క్రిస్మస్ సంప్రదాయంలో భాగమైంది రాణి విక్టోరియా తనకు చిన్నప్పటి నుండి ఈ చెట్టుతో అనుబంధం ఉన్నట్టు ఒక పత్రికలో పేర్కొన్నారు. ఆ తరువాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ చెట్టు ప్రసిద్ధిచెందింది.

క్వీన్ విక్టోరియా, జర్మన్ యువరాజు ఆల్బర్ట్ తమ కుటుంబంతో కలిసి ఒక క్రిస్మస్ చెట్టు చుట్టూ తిరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది క్వీన్ విక్టోరియా ఏ పని చేసినా దానిని తక్షణం అనుసరించే బ్రిటన్ ప్రజలు ఈ సంప్రదాయాన్ని కూడా అప్పటి నుంచే ఆచరించడం మొదలు పెట్టారు. బ్రిటన్ తో పాటు అమెరికా, తదితర దేశాలు కూడా క్రిస్మస్ చెట్టును అధికారికంగా క్రిస్మస్ వేడుకల్లో భాగం చేశాయి.