Christmas star
క్రిస్మస్ నక్షత్రం
స్టార్ కు మాత్రమే ప్రాధాన్యత ఈ సీజన్లో , ఒక్క స్టార్ కి తప్ప మరి దేనికీ ప్రాధాన్యత లేదు . తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో మిక్కిలి ప్రకాశించే నక్షత్రాన్ని చూసి , ఆయనను పూజించేందుకు బెత్లహేముకు వచ్చారు . వారు వెళ్తుండగా ఆనక్షత్రం వారికి ముందుగా ఉండి నడిపించింది. జ్ఞానులు హేరోదు రాజు వద్దకు వెళ్లి , యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు. మేము ఆయనను పూజించేందుకు వచ్చామని చెబుతారు . వీరు నక్షత్రాన్ని చూసి , దూరదేశం నుంచి బెత్లహేముకు వచ్చారు. ఆయన రాజభవనంలో జన్మించి వుంటాడని భావించి, వారు నేరుగా రాజనగరానికి చేరుకున్నారు . అయితే వీరు వెళ్తుండగా నక్షత్రం వీరికి ముందుగా వెళ్తూ ఆ శిశువు ఉన్నచోటకు వెళ్లి ఆగింది అప్పుడు వారందరూ పశువులపాకలో తల్లి అయిన మరియను , శిశువు అయిన ప్రభువును చూసారు . ఆనందంతో ప్రభువును ఆరాధించారు .
0 Comments