Anger

                 కోపం



1 కొరింథీయులకు 13:4-5

4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది తొందరగా కోపం తెచ్చుకోదు ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.


ఎఫెసీయులకు 4:26

26 కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు.

 27 సాతానుకు అవకాశం ఇవ్వకండి. 


లేవీయకాండము 19:17-18

17 “నీ సోదరుణ్ణి నీ హృదయంలో కూడా నీవు ద్యేషించకూడదు. ఒకవేళ నీ పొరుగువాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని గురించి అతనితో మాట్లాడు. అయితే అతణ్ణి క్షమించు. 

18 మనుష్యులు నీకు చేసిన కీడును మరచిపో. వారికి తిరిగి కీడు చేయాలని ప్రయత్నించకు. నిన్ను నీవు ప్రేమించుకొన్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. నేను యెహోవాను.


సామెతలు 10:12

12 ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. కానీ మనుషులు చేసే ప్రతి తప్పునూ ప్రేమ క్షమిస్తుంది.


యాకోబు 1:19-20

19 నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాలు గురించి తెలుసుకోండి: ప్రతి మనిషి వినడానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి. 

20 ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని నెరవేర్చదు.


సామెతలు 15:1

1 సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.


సామెతలు 14:29

29 వివేకం గలవాడు త్వరగా కోపం తెచ్చుకోడు. ముక్కోపికి మూర్ఖత్వమే బహుమతిగా దక్కుతుంది.


మార్కు సువార్త 7:20-23

20 ఆయన మరల ఈ విధంగా అన్నాడు “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 

21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, హత్యలు, లైంగిక అవినీతి, 22 కామవికారాలు, వ్యభిచారం, దూషణలు, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు,  అసూయలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 

23 ఇవన్నీ తన లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”


సామెతలు 13:10

10 గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది.


సామెతలు 12:16

16 మూర్ఖుల కోపం వెంటనే బయట పడుతుంది. వివేకం గలవాడు తనకు జరిగిన అవమానం గురించి వెల్లడి చేయక మౌనం వహిస్తాడు.


సామెతలు 20:3

3 కలహానికి దూరంగా ఉండడం మనిషికి గౌరవం. మూర్ఖుడు కావాలని వాదం పెట్టుకుంటాడు.


సామెతలు 29:11

11 బుద్ధిహీనుడు తన కోపమంతా వెళ్ళగక్కుతాడు. జ్ఞానం గలవాడు కోపం అణచుకుంటాడు.


యిర్మీయా 3:12

12 నీవు పోయి ఉత్తరం వైపుకు ఇలా ప్రకటించు విశ్వాసం లేని ఇశ్రాయేలీయులారా తిరిగి రండి మీ మీద నేను కోపపడను. నేను దయగలవాణ్ణి కాబట్టి శాశ్వతంగా కోపించేవాణ్ణి కాను. ఇదే యెహోవా వాక్కు.


కీర్తనల గ్రంథము 37:8

8 కోప పడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి.


సామెతలు 29:22

22 కోపంగల మనిషి కలహం రేపుతాడు. కోపపడే మనిషి చాలా పాపాలు చేస్తాడు.


ప్రసంగి 7: 9

9 కోపించడానికి తొందరపడవద్దు.మూర్ఖుల హృదయాల్లో కోపం నిలిచి ఉంటుంది.


సామెతలు 15:1

1 సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.


మత్తయి సువార్త 5:22

22 కాని నేను చెప్పేదేమిటంటే తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షించబడతాడు. తన సోదరుణ్ణి ‘పనికిమాలినవాడా’ అన్న ప్రతి వ్యక్తీ మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి ‘మూర్ఖుడా!’ అన్న ప్రతి వ్యక్తీ నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది.


ఎఫెసీయులకు 4:31

31 మీలో ఉన్నకోపాన్ని, కక్షను, దూషించేగుణాన్ని, పోట్లాడే గుణాన్ని,మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. 


2 తిమోతికి 2:23-25

23 కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు. 

24 అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి. 25 తనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు శాంతంగా బోధించాలి. వారి హృదయాలు మార్చి దేవుడు వారికి సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి. 


రోమీయులకు 12:21

21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి


సామెతలు 22:24

24 కోపం అదుపులో ఉంచుకోలేని వాడితో స్నేహం చెయ్య వద్దు. క్రోధంతో రంకెలు వేసే వాడి దగ్గరికి వెళ్ల వద్దు.