Christmas candles
క్రిస్మస్ కొవ్వొత్తులు
" నేను ఈలోకమునకు వెలుగై ఉన్నాను " అని క్రీస్తు పదే పదే తన ప్రసంగాలలో చెప్పియున్నారు . అందుకే క్రిస్మస్ రోజున అర్ధరాత్రి సమయంలో క్రైస్తవులందరూ తప్పనిసరిగా చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగిస్తారు . పాపమనే అంధకారం నుండి వెలుగు వైపు నడిపించే , దివ్యజ్యోతి క్రీస్తు అని భక్తుల విశ్వాసం . వెలుగునకు ప్రతీకలుగా కొవ్వొత్తులును మలచుకుని వెలిగిస్తారు . పేదలకు కూడా అందుబాటు ధరలో ఉండే కొవ్వొత్తులను తమ తాహతుకు తగ్గట్టు మొక్కుబడిగా వెలిగిస్తుంటారు .
0 Comments