యేసు రాకడకు ముందు



1. బైబిలు అంతయును తెలిసికొనవలెను.
 
2. సువార్త పని ముగించి యుండవలెను. అనగా ఎవరికి చెప్పగలమో వారికి చెప్పి యుండుట, పత్రికాదులు మొదలైనవి పంచిపెట్టుట.
 
3. చేయవలసిన ప్రార్ధనలన్నియు ముగించవలెను.
 
4. ఇవ్వవలసిన చందాలన్నియు ఇచ్చి వేయవలెను. తీర్చవలసిన అప్పులన్నియు తీర్చివేయవలెను. 

5. తప్పులు ఒప్పుకొని ఇతరులతో సమాధానపడవలెను.
 
6. ఇది వరకు వ్రాసికొన్న నోట్సులు ఒక పర్యాయము చూచుకొనవలెను. 

7. చేయవలసినవి చేతునను తీర్మానము చేయవలెను.

8.ఇదివరకు నోట్సు మీదను
, ఇతరుల ప్రార్దనమీదనుఆనుకొన్న యెడల ఇప్పుడది మానివేయవలెను. మీకు మీరే ప్రార్ధనాస్తుతులతో కనిపెట్టవలయును. వాక్యము ఆధారము చేసుకొని ప్రభుయేసునందలి విశ్వాసముతో సిద్ధపడవలెను. రాకడను గురించి పత్రికలలోను, నోట్సులలోను, ఉండు సంగతులన్నియు చదివియుండవలెను.
 
9. మనము చేయుదుమని చేయనియెడల ప్రభువు తనపని యెట్లుచేయునని నీవు చెప్పగలవు సిద్ధపడుటలో ఆలస్యము చేయగూడదు. నీవు వెళ్ళి ఆలాగు చేయుమని ప్రభువు ఒక ధనికునితో చెప్పెను. ఎవరు చేయవలెను ప్రభువా అని అడుగనక్కరలేదు గనుక ఎవరు చేయవలసినది వారు చేయవలెను నాకు రాకడను గూర్చి తెలియలేదు. తెలిసికొనకపోవుట ఎవరి తప్పు. నీవు రక్షింపబడిన తర్వాత ఎక్కువ సేవచేసిన ఎక్కువ ఫలితము పొందుదువు. గాని రాకడలో పాలెక్కడ
? నీవెక్కువ బైబిలు చదివిన ఎక్కువ జ్ఞానము పొందుదువు గాని రాకడలో పాలు యెక్కడ, నీవెక్కువమందిని గూర్చి ప్రార్ధన చేసిన యెక్కువ ఫలితము పొందుదువు గాని రాకడలో ఫలితము నీకు ఎక్కడ? యెక్కువ సువార్త పని చేసిన యెక్కువ సువార్త ఫలితము పొందుదువుగాని రాకడలో పాలెట్లుండును? యెక్కువ చందావేసిన దానికి ఫలితముగాని రాకడలో పాలెట్లుండును? రాకడకు సిద్ధపడితేనే రాకడలో పాలుండును.

10. జలప్రళయము కథ దానియేలు 2
,7 అధ్యాయములు, ఏలియా ఆరోహణము హనోకు ఆరోహణము మార్కు 18:32-37. రాకడను గూర్చి ప్రభువు చెప్పిన మాటలు అపోస్తులుల మాటలు పూర్తిగా నేర్చుకొనవలెను.

ప్రశ్నలు : చదువరీ క్రీస్తుప్రభువు త్వరగా వచ్చుననగా ఆయన వచ్చుటకు అయనకేమియు అడ్డములు లేవని  అర్ధమనియు 
గురుతులైన తరువాత త్వరగా వచ్చుననియు గ్రహించినావా?
 
2.ఫలానప్పుడు వచ్చెదనని ప్రభువు తారీఖు చెప్పలేదు. గనుక ఎప్పుడు బడితె అప్పుడే ఆయన వచ్చునని(గ్రహించినావా
?
 
3.బహిరంగమైన గురుతులే కాదు. ప్రభువు నీకు
స్వయముగా చెప్పిన గురుతు గ్రహించినావా
? 

4. నీవు రక్షింపబడియున్నావని నీకు నిశ్చయమేనా
? ఇదికూడ ప్రభువు నీకు చెప్పినాడా? 

5. నీవు పరిశు ద్ధాత్మ బాప్తిస్మము పొందినావని ప్రభువు నీకు చెప్పినాడా
? ఇది నిశ్చయమేనా?

6. ఇంతకాలము సిద్ధముగా నుండి ఆయన వచ్చునప్పుడు చల్లపడెదవని నీకు తోచినదా? 

7. చెప్పబడిన వారందరు అబద్ధ ప్రవక్తలు కారనియు
,
బైబిలులో చెప్పబడిన అబద్ద ప్రవక్త ఏడేండ్లలో వచ్చుననియు గుర్తించినావా
?

8.అబద్ధప్రవక్తలైనను అంత్య క్రీస్తులైనను క్రీస్తు యొక్క దైవత్వము ఒప్పుకొనని వారికిని
, లోకము యొక్క ఆందోళన చూచి రెండవరాకడ దగ్గరపడినదని చెప్పిన ఇవన్ని 2000 సం॥ముల నుండి ఉన్నవేగాని క్రొత్తవి కావు. చెప్పువారికిని గుర్తులు కొన్ని స్థలములలోనేగాని అన్ని స్థలములలో లేవను వారికిని ఈ రీతిగా రాకడకు ఎదురు ప్రశ్నలు వేయువారికి జవాబు
చెప్పగలవా
? 

9. నేను తప్పకుండ ఎత్తబడుదును విశ్వాసమును బట్టి
ఆనందించువారికిని నేను రాకడ సంగతులన్నియు నేర్చుకొన్నాను గనుక ఎత్తబడుదునను వారికిని
, నాయందు అభిమానముగల వారందరు నన్ను గురించి ప్రార్ధించుచున్నారు గనుక నేను ఎత్తబడుదునను వారికిని, నేను బాప్తిస్మము పొందినాను గనుక ఎత్తబడుదునను వారికిని, మనవలె ఇన్ని సంగతులు నేర్చుకొనక, సిద్ధపడక యేసుప్రభుని నమ్మిన వారిని ఆయన తీసికొని వెళ్లెను కాబట్టి నన్ను కూడా తీసికొని వెళ్ళును అనువారికి, ఆయన రాకడను గూర్చి కూడా సువార్త ప్రకటనలో చేర్చి ప్రకటించుచు అనేకమందిని నమ్మింపజేయుచున్నాను. గనుక తప్పకుండ ఎత్తబడుదునను వారికి చెప్పు జవాబు నీ దగ్గర నున్నదా? ఇవన్నియు ఎత్తబడుటకు నిజమైన కారణములేనా? పై సంగతులు అనుకొనువారిని గురించియే పరిశుద్ధాత్మకు విరోధమైన పాపమనియు హెబ్రీ 6:1-7 వ॥లు ప్రభువు చెప్పుచున్నారు.
 
10)ఎత్తబడుదువని పైన చెప్పిన విధముగా సంతోషించు వారికి యెహెజ్కేలు 33:23-80లో ఉన్న సంగతిని గూర్చి జ్ఞాపకము చేసినావా?
 
11) ఎవరువాక్యము విందురో
, యెవరు విశ్వసించి ఆప్రకారము విధేయులై నడుచుకొందురో, యెవరు విశ్వసించి ఆ ప్రకారము విధేయులైనడుచుకొందురో,యెవరు ఎత్తబడవలసిన నూతన యెరూషలేములో నుండు కాంతి చూచుటకుభూలోకములో తర్భీదులగుదురో, యెవరు యోహానువలె ఈ లోకములోయేసుక్రీస్తు ప్రభువుతో మిక్కిలి సహవాసము చేయుదురో అట్టివారుఎత్తబడుదురు.
 
12) అబద్ధ ప్రవక్తలు ఎవరు
? ఎ) క్రీస్తు అక్కడ ఉన్నాడు,ఇక్కడ ఉన్నాడు అని చెప్పువారు అబద్ధ ప్రవక్తలు అలాగు అనని వారినిచూచి కొందరు బోధకులు ఇతర బోధకులను అబద్ద ప్రవక్తలని చెప్పుచున్నారు.అట్లు ఇతరులను అబద్ద బోధకులనువారే అబద్ధ ప్రవక్తలు బి) చివరిరోజులలో అపహాసకులు వచ్చి సృష్టాది మొదలు ఇప్పటివరకు ఇట్లేయున్నదిగనుక రాకడ ఇప్పుడని యెట్లు చెప్పగలమని అనువారు అబద్ధ ప్రవక్తలు సి) రాకడ సమీపముగా లేదని గురుతులు జరిగిన తర్వాత కూడా ఎవరు అందురో వారే అబద్ధపు ప్రవక్తలు డి) రాకడను గురించి బోధించువారిని చూచి, అది తప్పు అని యెవరు చెప్పుదురో వారే అబద్ధప్రవక్తలు.
 
13) కృపను లోకువ కట్టుట అనగానేమి
? నాకు సిద్ధపడుట చాలా ఇష్టముగాని ఆటంకములున్నవి, నా ఆటంకములు ప్రభువు తొలగించి నన్ను రాకడలో తీసికొని వెళ్ళునని తలంచుదురు. దేవుడు కృప చొప్పున చేర్చుకొన్నను న్యాయమును బట్టి శిక్ష వచ్చును. రాకడకు ముందు మనిషి కృపాకాలములో నుండును. ప్రభువు అనేకమైన గడువులిచ్చును, ఈ గడువులు త్రోసివేసినట్లయిన న్యాయము దగ్గరకు వెళ్ళవలసి ఉండును. కృపలో గడువు ఇవ్వబడినది. ఆ గడువును వాడుకొనక పోయిన న్యాయము వచ్చి రావలసిన మహిమ తీసివేయును.

14) బూరలు
, ముద్రలు, శ్రమలు అయిన తర్వాత అతి గొప్ప భయంకర శ్రమలైన పాత్రల శ్రమలకు ముందు దేవుడు మహాగొప్ప స్వరముతో ప్రజలారా నా పైపు తిరగండి అనును. అనేక మంది తిరుగుదురు. అయితే ఆయనను యెరిగిన వారే కృపను లోకువ కట్టిన వారు కృపను ద్వేషించిన వారు. మారు మనస్సు లేనివారు వారి తల్లిదండ్రులను లోకువ కట్టువారు తమ పిల్లలే, బయటివారు కారు. ఇతరులైతే ఎదిరింతురు అలాగే దేవుని సంగతులు ఎరిగినవారే దేవుని లోకువ కట్టుదురు. నోవహు ఓడ మూయబడును. కృప ఆగిపోవును తప్పి పోయిన కుమారుడు తండ్రిని క్షమాపణ కోరుకొన్నాడు. విడిచి పెట్టవలసినవి విడిచిపెట్టినాడు. పూర్తిగా రావడము కుమారత్వమునకు సంబంధించినది. గనుక తండ్రి కుమారునిగా చేర్చుకొనెను. గాని దాసునిగా చేర్చుకొనలేదు. ఎవరైనను సిద్ధపడిన తర్వాతనే అయోగ్యుడను అనిన బాగుండును గాని సిద్ధపడక ముందు అనుట బాగుండదు.