Dependence
ఆధారపడటం
యెషయా గ్రంథము 41:13
13 నేను యెహోవాను, నీ దేవుణ్ణి నేను నీ కుడిచేయి పట్టుకున్నాను. నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను. అని నేను నీతో చెబతున్నాను.
సామెతలు 3:5-6
5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాాను నమ్ముకో.
6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
సామెతలు 16:9
9 ఒక వ్యక్తి తాను చేయాలనుకొనే వాటి విషయంలో పథకాలు వేయవచ్చు. అయితే ఏంజరుగుతుంది అనేది నిర్ణయించే వాడు యెహోవా.
కీర్తనల గ్రంథము 73:26
26 నా హృదయము, నా శరీరము, క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు.
సామెతలు 19:21
21 మనుష్యులు ఎన్నో పథకాలు వేస్తారు. కాని యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి.
రోమీయులకు 12:16
16 అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. గర్వించకండి. తక్కువ స్థాయిగల వాళ్ళతో సహవాసం చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని భావించకండి.
యెషయా గ్రంథము 40:29
29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.
కీర్తనల గ్రంథము 121:3
3 ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు.
ఫిలిప్పీయులకు 4:11
11 నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకొన్నాను.
మత్తయి సువార్త 6:34
34 రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి.
యోహాను సువార్త 15:5
5 నేను తీగను. మీరు నా కొమ్మలు. నేను ఎవరిలో ఉంటానో, నాలో ఎవరు ఉంటారో, అతడు అధికంగా ఫలిస్తాడు. నా నుండి దూరంగా ఉండి మీరేమీ చెయ్యలేరు.
కీర్తనల గ్రంథము 23:2
1 యెహోవా నా కాపరి నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
నిర్గమకాండము 14:14
14 మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.
కీర్తనల గ్రంథము 16:8
8 నేను అన్నివేళలా యెహోవా వైపు చూస్తూ ఉంటాను, నేను ఆయన కుడిచేతిలో నుండి కదిలిపోను!
1 దినవృత్తాంతములు 29:14
14 ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు. ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే. నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము.
సామెతలు 10:22
22 యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు.
కీర్తనల గ్రంథము 127:1
1 యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కడుతున్న వారు పాటుబడడం వ్యర్ధం. యెహోవా పట్టణానికి కావలిగా లేకపోతే పట్టణాన్ని కాపలా కాసేవారు నిలబడి ఉండడం వ్యర్ధం.
కీర్తనల గ్రంథము 94:18
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు. కాని యెహోవా తన అనుచరుని బల పరిచాడు.
కీర్తనల గ్రంథము 118:5
5 నేను కష్టంలో ఉన్నాను. కనుక నేను సహాయము కొరకు యెహోవాకు మొర పెట్టాను, యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
కీర్తనల గ్రంథము 16:1
1 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
రోమీయులకు 12:4-5
4 దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు.
5 అదే విధంగా మనం అనేకులమైనా మనమంతా క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.
కీర్తనల గ్రంథము 80:19
19 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము. నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
రోమీయులకు 8:8
8 ప్రాపంచికంగా జీవించే వాళ్ళు దేవుని మెప్పుపొందలేరు.
కీర్తనల గ్రంథము 44:3
3 ఈ భూమిని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసి కోలేదు.వారిని విజేతలుగా చేసింది వారి బలమైన భుజబలం, హస్తాలు, కావు. మా తండ్రులకు తోడుగా నీవు ఉన్నందుకే అది జరిగింది. దేవా, నీ మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు కాబట్టే !
ప్రసంగి 7:14
14 రోజులు బాగున్నప్పుడు, నువ్వు దాన్ని అనుభవించు. కాని, మనకు రోజులు బాగుండనప్పుడు, దేవుడు మనకి చెడ్డ రోజులు, మంచి రోజులు, వ్రాసి పెట్టాడన్న విషయం మరచిపోకు. ముందేమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదు.
కీర్తనల గ్రంథము 68:19
19 యెహోవాకు స్తుతికలుగు గాక. మనం మోయాల్సిన బరువులు మోయడంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు.
కీర్తనల గ్రంథము 31:1
1 యెహోవా, నీవే నా కాపుదల. నన్ను నిరాశపరచవద్దు. నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
కీర్తనల గ్రంథము 3:3
3 ఆయితే, యెహోవా, నీవు నాకు కేడెము. నీవే నా అతిశయం.
యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా చేస్తావు.
కీర్తనల గ్రంథము 54:4
4 చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
కీర్తనల గ్రంథము 130:1-2
1 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము. సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము
యోబు గ్రంథము 1:20-21
20 అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తల వెంట్రుకలు గొరిగించుకుని నేల పై పడుకుని సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. 21 నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.
కీర్తనల గ్రంథము 3:8
8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు. యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.
ప్రసంగి 3:11
1 దేవుడు మనకు తన జగత్తు గురించి ఆలోచించే సామర్థ్యాన్నియిచ్చాడు. అయితే దేవుడు చేసే విషయములన్నింటిని మనం ఎప్పుడూ పూర్తిగా తెలుసుకోలేము. అయితేనేమి, దేవుడు అన్ని పనులను సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు.
రోమీయులకు 15:32
32 తదుపరి, దేవుని చిత్తమైతే నేను మీ దగ్గరకు ఆనందంగా వచ్చి మీతో పాటు సమయం గడుపుతాను.
కీర్తనల గ్రంథము 62:5
5 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను. దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.
1 సమూయేలు 2:7
7 యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు, మరి కొంతమందిని ధనవంతులుగా చేస్తాడు. పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే.
అపొస్తలుల కార్యములు 12:5
5 పేతురును అంతదాకా కారాగారంలో ఉంచాడు. పేతురు కోసం సంఘానికి చెందిన వాళ్ళు దీక్షతో దేవుణ్ణి ప్రార్థించారు.
నిజమైన నమ్మకం అంటే ప్రతిదానికీ దేవునిపై పూర్తిగా ఆధారపడటం.
ప్రార్థన అనేది మీరు దేవునిపై ఆధారపడటం మరియు మీ జీవితానికి ఆయన దిశను గుర్తించడం.
నిజమైన క్రైస్తవ మతం అంటే దేవుని ఆత్మ యొక్క పని మీద ఆధారపడటం ద్వారా నిజమైన క్రీస్తు లాంటి ప్రవర్తనను వ్యక్తపరచడం.
మీ స్వంత బలం కంటే ఆయన దయపై ఆధారపడటం నేర్పడానికి దేవుడు కాలిబాటలను ఉపయోగిస్తాడు
0 Comments