Awe in bible
                                                                                                   విస్మయం  
              


సామెతలు 8:13

13 దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం,అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు అసహ్యం


2 కొరింథీయులకు 7:1

1 ప్రియమైన కొరింతు ప్రజలారా ఈ వాగ్దానములు ఉన్నవి కాబట్టి దేవుని పై భయభక్తులతో పరిపూర్ణమైన పరిశుద్ధత కోసం తపన పడుతూ శరీరమునకు ఆత్మకూ అంటిన కల్మషం కడుక్కుందాం.


సామెతలు 3:7_8

7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవాా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం నీ ఎముకలకు శక్తీ కలుగుతాయి.


సామెతలు 22:4

4 యెహోవాను గౌరవించి దీనుడవుగా ఉండు. అప్పుడు నీకు ఐశ్వర్యం, ఘనత నిజజీవం ఉంటాయి.


కీర్తనల గ్రంథము 33:18

18 యెహోవాను అనుసరించే ప్రజలను ఆయన రక్షిస్తాడు ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా కాపాడుతాడు. ఆయన మహా ప్రేమ ఆయనను నమ్మిన వారందరిని కాపాడుతుంది.


సామెతలు 31:30

30 సౌందర్యము, అందము నిన్ను మోసగించవచ్చు.అయితే యెహోవాను గౌరవించే స్త్రీ పొగడబడాలి.


ద్వితీయోపదేశకాండమ 10:12-13

12 ఇశ్రాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు చెయ్యాలని మీ దేవుడైన యెహోవా కోరుకునేది ఇదే: మీ దేవుడైన యెహోవాను గౌరవించి ఆయన మీతో చెప్పినవన్నీ చేయండి. మీ నిండు మనస్సుతో మీ నిండు ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి సేవించండి. 

13 ఈ రోజు నేను మీకు చెబుతున్న యెహోవా ఆజ్ఞలను చట్టాలను  పాటించండి. ఈ ఆజ్ఞలు చట్టాలు మీ మంచికోసమే.


సామెతలు 15:16

16 ధనికునిగా అనేక కష్టాలు పడుతూ ఉండటంకంటె దరిద్రునిగా ఉండి యెహోవాను గౌరవించటం మేలు.


కీర్తనల గ్రంథము 128:1

 యెహోవా పైన భయభక్తులు విశ్వాసమైన నమ్మకం కలిగి ఆయన ఆజ్ఞానుసారం నడిచే వారందరు ధన్యులు.


సామెతలు 1:7

7 యెహోవాాపట్ల భయం భక్తి కలిగి ఉండడం తెలివికి మూలకారణం. మూర్ఖపుప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు.


ద్వితీయోపదేశకాండమ 13:4

4 మీరు మీ యెహోవాా దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయననే హత్తుకొని ఉండాలి.


మలాకీ 4:2

2 అయితే నా వద్ద భయభక్తులు కలిగిన మీ కోసం నీతిసూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల చాటున మీకు రక్షణ కలుగుతుంది. పాక నుండి విడిచిపెట్టబడిన దూడల్లా మీరు ఆనందముగా స్వేచ్ఛగా ఉంటారు


సామెతలు 15:33

33 జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం యెహోవాా పై భయభక్తులు కలిగి ఉండటమే . వినయం కలిగి ఉంటే గౌరవం ప్రతిష్ట కలుగుతాయి


రోమీయులకు 13:7

7 ఎవరికేది రుణ పడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు రుణ పడి వున్నవారికి పన్నులు సుంకాలు రుణపడి వున్నవారికి సుంకాలు చెల్లించండి. మర్యాద ఐతే మర్యాద గౌరవం ఐతే గౌరవం ఇవ్వండి.


నిర్గమకాండము 1:21

 21 ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు


సామెతలు 9:10

10 యెహోవాా మీద భయ భక్తులు కలిగి ఉండడం జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం. వివేకానికి ఆధారం పరిశుద్ధుమైన దేవుని గురించి తెలివి కలిగి ఉండడమే.


ప్రసంగి 12:13

13 ఇదంతా వినిన తరువాత తేలింది ఇదే.నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞల్ని పాటించాలి.

మానవులంతా చేయాల్సింది కూడా ఇదే.


కీర్తనల గ్రంథము 112:1

1 యెహోవాను స్తుతించండి. యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు.


యోబు గ్రంథము 6:14

14  ఒక మనిషి కష్టాల్లో ఉంటే అతని స్నేహితులు అతని పై జాలి చూపించాలి. ఒక మనిషి తన స్నేహితుడు సర్వశక్తివంతుడైన దేవుని నుండి దూరంగా పోయినా సరే అతడు ఆ స్నేహితునికి నమ్మకంగా ఉండాలి.


కీర్తనల గ్రంథము 111:10

10 యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.


కీర్తనల గ్రంథము 67:7

7 దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమిపై వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి ఆయనను గౌరవించెదరు గాక.


ద్వితీయోపదేశకాండమ 8:6

6 ఆయన మార్గాలలో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవాా దేవుని ఆజ్ఞలను పాటించాలి.


అపొస్తలుల కార్యములు 9:31

31  కావున యూదయ గలిలయ సమరయ ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా వుంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పై భయము, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.