Christmas in Bible
క్రిస్మస్
క్రైస్తవులు దేవుని కుమారుడని నమ్మే యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి క్రిస్మస్ జరుపుకుంటారు. 'క్రిస్మస్' అనే పేరు మాస్ ఆఫ్ క్రీస్తు (లేదా jesus) నుండి వచ్చింది. సామూహిక సేవ (దీనిని కొన్నిసార్లు కమ్యూనియన్ లేదా యూకారిస్ట్ అని పిలుస్తారు) అంటే యేసు మనకోసం చనిపోయాడని తరువాత తిరిగి జీవంలోకి వచ్చాడని క్రైస్తవులు గుర్తుంచుకుంటారు.
ప్రకటన 12: 1-5
1 పరలోకంలో అద్భుతమైన ఒక గొప్ప దృశ్యం కనిపించింది సూర్యున్ని తన వస్త్రంగా చంద్రున్ని తన పాదాల కింద పన్నెండు నక్షత్రముల కిరీటాన్ని తలపై పెట్టుకున్న ఒక స్త్రీ కనిపించింది
2 ఆమె నిండు చూలాలు ప్రసవించే సమయం రావడం వల్ల ఆమె తీవ్ర వేదన పడుతూ బిగ్గరగా కేకలు వేసింది.
3 ఇంతలో పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. అది రెక్కలు కలిగిన మహా సర్పం. ఏడు తలలతో పది కొమ్ములతో కనిపించింది. దాని ఏడు తలల పైన ఏడు కిరీటాలు ఉన్నాయి
4 ఆ సర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఊడ్చి వాటిని భూమ్మీదికి విసిరికొట్టింది ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ బిడ్డను మ్రింగి వేద్దామని ఆ సర్పం ప్రసవించబోయే ఆ స్త్రీకి ముందు నిలబడివుంది.
5 ఆమె ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది ఆ బాలుడు దేశాలను సైతం గొప్ప అధికారంతో పరి పాలిస్తాడు
లూకా సువార్త 1:35
అప్పడు దేవదూత ఈ విధంగా సమాధానం ఇచ్చాడు " పవిత్రాత్మ నీ మీదికి వచ్చినప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందుచేత నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు ". ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.
మత్తయి సువార్త 1:18 -19
18 యేసుక్రీస్తు జననం ఈ విధంగా జరిగింది. క్రీస్తు తల్లి మరియకు యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయం జరిగింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పవిత్ర ఆత్మ శక్తి వలన గర్భం ధరించింది.
19 కాని ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమానించకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.
యెషయా 9: 6
మన కోసం ఒక బాలుడు పుట్టియున్నాడు మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది ఆయన భుజం మీద పరిపాలన ఉంటుంది ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త శక్తిశాలి అయిన దేవుడు ''నిత్యం శాశ్వతుడై జీవించే తండ్రి శాంతి సమాధానాల అధిపతి రాజు'' అనేది ఆయన పేరు
యెషయా 7:14
అందువల్ల ప్రభువు స్వయంగా మీకు ఒక సంకేతం ఇస్తాడు కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని ఆయనను ఇమ్మానుయేలు అనే పేరుతో పిలుస్తుంది.
మత్తయి సువార్త 1:21
ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షిస్తాడు. కాబట్టి ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు అని అన్నాడు.
లూకా 2: 7
ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది ఈయన ఆమె మొదటి కుమారుడు వాళ్ళకు సత్రంలో గది దొరకనందువల్ల ఆ పసివాణ్ణి మెత్తని గుడ్డలతో చుట్టి, ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది
యోహాను సువార్త 1 14
ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా మన మధ్య జీవించాడు ఆయన తండ్రికి ఏకైక కుమారుడు తండ్రి కుమారునికి ఉండే మహిమలాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము
కొలొస్సయులకు 1:15
ఆయన కనిపించని దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన మొదటివాడు
గలతీయులకు 4:4
సరైన సమయం రాగానే ఆ దేవుడు తన కుమారుడిని పంపాడు ఆ కుమారుడు ధర్మశాస్త్రం క్రింద ఒక స్త్రీకి జన్మించాడు
మత్తయి సువార్త 1:22 23
22 23 కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది వారందరు ఆయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నిజం కావటానికే ఇలా జరిగింది.
మత్తయి సువార్త 2
1 హేరోదు రాజు కాలంలో యేసు యూదయ బెత్లెహేములో జన్మించిన తరువాత
తూర్పునుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి,
2 యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు?
అతని నక్షత్రం చూశాము ఆయనను ఆరాధించడానికి వచ్చాము. అని అన్నారు
లూకా సువార్త 2:11
దావీదు పట్టణంలో ఈ రోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.
లూకా సువార్త 2:21
ఎనిమిది రోజుల చివరలో, అతడు సున్నతి పొందినప్పుడు, అతన్ని యేసు అని పిలిచారు, అతను గర్భంలో గర్భం దాల్చడానికి ముందే దేవదూత ఇచ్చిన పేరు.
యోహాను సువార్త 3
16 దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం.
17 దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ ఇవ్వడానికే గాని తీర్పు చెప్పడానికి పంపలేదు.
1 యోహాను 4
9 దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ లోకంలోకి పంపించి ఆయన ద్వారా మనం జీవించాలనేది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది
0 Comments