Blessing
దీవెన



సంఖ్యాకాండము 6:24-26

24 యెహోవాాా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక!
25 యెహోవాాా మీపై తన వెలుగు ప్రకాశింప చేస్తాడు గాక! మిమ్మల్ని కరుణిస్తాడు గాక!
26 మిమ్మల్ని కనులారా యెహోవాాా చూసి మీకు శాంతిని ప్రసాదించు గాక!


కీర్తనల గ్రంథము 20:4

4 నీకు నిజంగా కావాల్సిన వాటిని ఆ దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.

సామెతలు 16:3

3 నీ పనుల భారమంతా యెహోవాా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి.


యిర్మీయా 29:11

11 ఇది నేనెందుకు చెపుతున్నానంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలన్నీ నాకే తెలుసు, ఇది యెహోవా వాక్కు. అవి మీకు ఒక నిరీక్షణనూ, ఒక భవిష్యత్తునూ, కలగజేసే  సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.


ఫిలిప్పీయులకు 4:19

19 యేసు క్రీస్తులో ఉన్న నా దేవుడు మహిమతో ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు. 


నిర్గమకాండము 23:25

25 మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించి సేవించాలి. అప్పుడు నువ్వు తాగే నీళ్ళ మీదా తినే ఆహారం మీదా, ఆయన దీవెనలు ఉంటాయి. ఎలాంటి రోగాలూ మీకు సంక్రమించవు.


కీర్తనల గ్రంథము 34:8

8 యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.


ద్వితీయోపదేశకాండమ 30:16

16 మీ దేవుడైన యెహోవాాను ప్రేమించి ఆయన మార్గాలలో నడుస్తూ ఆయన విధులూ ఆజ్ఞలూ చట్టాలూ  ఆచరించమని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. అలా మీరు చేస్తే  స్వాధీనం చేసుకోడానికి ప్రవేశించే ప్రాంతంలో మీ యెహోవాా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.


కీర్తనల గ్రంథము 23:1-2

1 యెహోవా నా కాపరి నాకు కొరత ఉండదు
2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.


రోమన్లు ​​12:14

14 మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదించండి. దీవించండి, కాని దూషించకూడదు.శపించవద్దు.


సామెతలు 16:20

20 ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు.


కీర్తనల గ్రంథము 31:19

19 నీలో భయభక్తులు గలవారి కోసం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది! మనుష్యులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.


లూకా సువార్త 6:27-28

27 వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. 
28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.


ఫిలేమోనుకు 1:25

25 మీ ఆత్మకు తోడుగా యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం ఉండుగాక!


1 పేతురు 3:9

9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందువల్లనంటే, తన దీవెనలకు మీరు వారసులు కావాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు.


గలతీయులకు 5:22-23

22 కాని పరిశుద్ధాత్మ వలన కలిగే ఫలాలు, శాంతం, సహనం,  ప్రేమ, ఆనందం, దయ, విశ్వాసం, మంచితనం,23 వినయం, 
ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు.


ద్వితీయోపదేశకాండము 28: 1

1 మీరు మీ యెహోవాా దేవుని మాట శ్రద్ధగా విని ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నింటి ప్రకారం నడుచుకుంటే మీ దేవుడైన యెహోవాా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు.


మత్తయి సువార్త 5:6

6 అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్ళకు ప్రతిఫలం దొరకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు.


మలాకీ 3:10

10 సర్వశక్తిమంతుడైన యెహోవా అంటున్నాడు,ఈ పరీక్షలో ప్రయత్నించండి. మీకు ఉన్నవాటిలో నుండి పదో భాగం నా దగ్గరకు తీసికొని రండి. వాటిని ధనా గారంలో ఉంచండి. నా మందిరానికి ఆహారం తీసికొనిరండి. నన్ను పరీక్షించండి!  అటువంటి పనులు  మీరు చేస్తే, అప్పుడు నేను మిమ్మల్ని  నిజంగా ఆశీర్వదిస్తాను. ఆకాశము నుండి వర్షం కురిసినట్లుగా, మంచి మంచి విషయాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం, కావలసిన దానికంటె ఎక్కువగా ఉంటాయి. 


మత్తయి సువార్త 5:9

9 శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు.


కీర్తనల గ్రంథము 119:2

2 ఆయన పవిత్రమైన శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయముతో ఆయన్ని వెతికేవారు ధన్యులు.


సామెతలు 10:22

22 యెహోవాా దీవెనలు ఐశ్వర్యం కలిగిస్తాయి. నరుల కష్టానికి మించిన సంపద వారికి కలుగుతుంది.


కీర్తనల గ్రంథము 1:1

1 చెడ్డవారి సలహాలు పాటించని వాడు, పాపాత్ముల దారిలో నిలిచి ఉండనివాడు, దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసి తిరగని వాడు, ధన్యుడు.


2 కొరింథీయులకు 9:8

8 అప్పుడు దేవుడు మీకు అవసరమున్న దాని కన్నా ఎక్కువే యిస్తాడు, మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించేటట్లు చెయ్యడమే కాకుండా సత్కార్యాలు చెయ్యడానికి కావలిసినవి సమృద్ధిగా ఇస్తాడు.


యూదా 1:2

2 దేవుని అనుగ్రహం, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా లభించునుగాక!


హబక్కూకు 3:19

19 నా ప్రభువైన యెహోవా నాకు బలాన్ని ఇస్తాడు. లేడిలా పరుగెత్తగలిగేలా ఆయన నాకు సహాయపడతాడు.
పర్వతాలపై ఆయన నన్ను సురక్షితంగా నడిపిస్తాడు.


సామెతలు 18:22

22 నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొంది నట్టే. నీ విషయమై యెహోవాకు సంతోషం.


ద్వితీయోపదేశకాండమ 15:6

6 మీకు చేసిన వాగ్దానం ప్రకారం మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.  అనేక రాజ్యాలకు మీరు అప్పు ఇచ్చేంత ధనం మీకు ఉంటుంది. కాని మీరు మాత్రం ఇతరుల దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం మీకుండదు. మీరు అనేక రాజ్యలను పాలిస్తారు. కానీ ఆ రాజ్యాల్లో ఏదీ మిమ్మల్ని పాలించదు.


సామెతలు 3:7-8

7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవాా వద్ద భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.
8 నువ్వు అలా చేస్తే, అప్పుడు నీ ఎముకలకు సత్తువా నీ శరీరమునకు మంచి ఆరోగ్యము  కలుగుతుంది.


2 కొరింథీయులకు 9:11

11  అన్ని విషయాలలో మీరు ధారాళంగా ఉండేటట్టు మీకు సకల ఐశ్వర్యాలు యిస్తాడు. మాద్వారా మీరు ఇచ్చిన విరాళాలు తీసుకొని విశ్వాసులు దేవుడికి కృతజ్ఞతలు చెపుతారు.


కీర్తనల గ్రంథము 67:7

7 దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.


మత్తయి సువార్త 5:8

8 పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.


యెహొషువ 1:8

 8 ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఆ గ్రంథాన్ని రాత్రి, పగలు ధ్యానించు. అప్పుడు అందులో వ్రాయబడిన విషయాలను పాటించగలుగుతావు. నువ్వు ఇలా చేస్తే, నువ్వు చేసే ప్రతీదీ తెలివిగావిజయవంతముగా చేయగలుగుతావు.


కీర్తనల గ్రంథము 149:4

4 యెహోవా తన ప్రజలందరినీ అమితంగా ప్రేమిస్తున్నాడు. దీనులైన తన ప్రజలకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు.


సామెతలు 18:21

21 జీవం, మరణం, తెచ్చే మాటలు నాలుక మాట్లాడ గలదు. ప్రజలు మాట్లాడటం ఇష్టపడేవారు. అది ఏమి తెచ్చునో దాన్ని తీసుకొనుటకు సిద్ధంగా ఉండ వలెను.


ప్రకటన గ్రంథము 22:21

21 ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్‌.


కీర్తనల గ్రంథము 34:1

1 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదవులపై ఉంటుంది.


1 రాజులు 2:3

3 దేవుని ఆజ్ఞలన్నీ శిరసావహించు. నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించు. ఆయన ధర్మశాస్త్రాలను పాటిస్తూ, ఆయన మనకు చెప్పిన వన్నీచేయి. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించిన సూత్రాలన్నిటినీ పాటించు. ఇవన్నీ నువ్వు పాటిస్తే, నువ్వు ఏది చేసినా, నువ్వు వెళ్లిన ప్రతి చోటా నీకు విజయం కలుగుతుంది


కీర్తనల గ్రంథము 29:11

11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక. యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.


ద్వితీయోపదేశకాండమ 10:12-13

12 ఇశ్రాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా కోరుకునేది ఇదే: మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయన మీతో చెప్పినవన్నీ చేయండి. మీ నిండు ఆత్మతో, మీ నిండు హృదయముతో, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, సేవించండి. 13 ఈ వేళ నేను మీకు చెపుతున్న యెహోవా ఆజ్ఞలను చట్టాలను, పాటించండి. ఈ చట్టాలు, ఆజ్ఞలు మీ మంచికోసమే.


యెహెజ్కేలు 34:26

26 నేను వాళ్ళను దీవిస్తాను. నా పర్వతం చుట్టూ ఉన్న స్థలాలను దీవిస్తాను. సరైన కాలాల్లో వానలు కురిపిస్తాను. దీవెనకరమైన జల్లులు పడతాయి.


హెబ్రీయులకు 13:20-21

20 శాంతిని స్థాపించే గొప్ప దేవుడు, గొఱ్రెల కాపరి అయిన మన యేసు ప్రభువును తిరిగి బ్రతికించాడు. ఈ కార్యమును దేవుడు శాశ్వతమైన ఒడంబడిక రక్తం ద్వారా జరిగించాడు. 
21 మీరు ఆయనకు యిష్టానుసారం నడుచుకునేటట్లు మీకు కావలసినవన్నీ ఆ దేవుడు సమకూర్చును గాక! యేసు క్రీస్తు ద్వారా ఆయన మనలో ఉండి, తన యిష్టాన్ని నెరవేర్చుగాక! ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.


కీర్తనల గ్రంథము 3:8

8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు. యెహోవా, దయ చూపించి  నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిపించుము.


మత్తయి సువార్త 5:4

4 దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు. కనుక వాళ్ళు ధన్యులు.


యోహాను సువార్త 20:29

29 అప్పుడు యేసు,నువ్వు నన్ను చూసి నమ్మావు. నన్ను చూడకుండా నమ్మిన వారు ధన్యులు అన్నాడు.


సామెతలు 10:6

6 మంచి మనిషిని ఆశీర్వదించమని మనుష్యులు దేవుని అడుగుతారు. అటువంటి మంచి విషయాలను చెడ్డవారు చెప్పవచ్చు కాని వారు తల పెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి.


లూకా సువార్త 24:50-51

50 వారిని అక్కడి నుండి ఆయన బేతనియ వరకూ  తీసుకు వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.
51 వారిని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన వారిమధ్యలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.


కీర్తనల గ్రంథము 33:12

12 యెహోవా ఎవరికైతే  దేవుడుగా  ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు. దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.


మలాకీ 2:2

2 మీరు కనుక నా పేరును గౌరవించకపోతే, అప్పుడు మీకు చెడు విషయాలు సంభవిస్తాయి. మీరు ఆశీర్వాదాలు చెప్పగా అవి శాపనార్థాలుగా మారుతాయి. నా పేరు అంటే మీరు గౌరవం చూపడం లేదు కనుక కీడులు సంభవించేటట్టుగా నేను చేస్తాను.సర్వశక్తివంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.


2 కొరింథీయులకు 13:14

13 యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము దేవుని ప్రేమ, మీ అందరితో ఉండుగాక!


సామెతలు 10:7

7 నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు కలుగుతాయి. భక్తిహీనుల జ్ఞాపకం అసహ్యం కలిగిస్తుంది.


యాకోబు 3:10

10 ఒకే నోటినుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు.


కీర్తనల గ్రంథము 31:16

16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
నన్ను రక్షించుము.


సామెతలు 2:7

 7 ఆయన నిజాయితీ గల మనుషులకు మంచి జ్ఞానం దాచి సమకూర్చి ఇస్తాడు. సరియైన మార్గము నుండి తప్పిపోకుండా నడుచుకునే వారికికు ఆయన రక్షణ కలుగజేస్తాడు.


యాకోబు 1:25

25 స్వేచ్ఛను కల్పించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్నిపరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు కార్యము చేస్తున్న వాడిగా పరిగణించబడతాడు.అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న అనేక కార్యములు ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు.


అపొస్తలుల కార్యములు 13:3

3 అక్కడున్న వారు వీరిద్దరిని పంపే ముందు ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వారిపై తమ చేతులుంచి పంపారు.


నిర్గమకాండము 1:20-21

20 మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజలలో వారి సంతానం విస్తరించింది. 21 ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు. 


సామెతలు 4:10

10 కుమారా, నా మాటలు విని, వాటి ప్రకారం నువ్వు నడుచుకుంటే నీకు అధికమైన  ఆయుష్షు కలుగుతుంది.


మార్కు సువార్త 10:29-30
29  యేసు, ఇది నిజం. నా కోసం, సువార్తకోసం, తన యింటిని కాని, సోదరులనుకాని, అక్కచెల్లెళ్ళను కాని, తండ్రినికాని, తల్లినికాని, భార్యనుకాని పిల్లలనుకాని, పొలాల్ని కాని, విడిచినవాడు ఈ తరంలోనే అనేక రెట్లు యిళ్ళను, సోదరులను, అక్కచెల్లెళ్ళను, తతల్లిని, పిల్లలను, పొలాల్ని, ఆస్తిని పొందుతాడు. వీటితో బాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్యజీవం పొందుతాడు.


లూకా సువార్త 6:22

22 మనుష్యకుమారుని కారణంగా జనులు మిమ్మల్ని దూరం చేసి మిమ్మల్ని ద్వేషించినప్పుడు,  అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులు.


యోబు గ్రంథము 42:10

10 కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించటం ముగించాడు. అప్పుడు యెహోవా యోబుకు మరల విజయం ఇచ్చాడు. యోబుకు అంతకు ముందు ఉన్న దానికంటే రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. 


కీర్తనల గ్రంథము 32:1

1 పాపాలు క్షమించబడిన వాడు ధన్యుడు. తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.


రోమీయులకు 1:7

7 అందుచేత రోము పట్టణములో ఉన్న మీరందరికీ వ్రాయునదిమేమనగా మీరు దేవునికి ప్రియమైన వాళ్ళు. అయినా మిమ్మల్ని తన మనుషులుగా  ఉండటానికి పిలిచాడు. మన తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని అనుగ్రహించి  మీలో శాంతి కలుగుజేయునుగాక!


కీర్తనల గ్రంథము 118:25-26

25 యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు.
26 యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము.


లేవీయకాండము 26:3

3 మీరు నా శాసనముల బట్టి వాటిని నడుచుకుంటూ నా ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అనుసరించి ప్రవర్తించాలి.
4 వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను. మీ భూమి పంటలనిస్తుంది. మీ పొలాల్లో చెట్లు ఫలిస్తాయి.


ఆదికాండము 26:4-5

4 నీ వంశస్థుల్ని ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరింపజేస్తాను. నీ వంశస్థులకు ఈ భూములన్నీ ఇస్తాను. నీ వంశస్థుల ద్వారా భూమిపైని జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.
5 నీ తండ్రియగు అబ్రాహాము నా మాటలకు లోబడి, నేను చెప్పిన వాటన్నింటిని చేసాడు కనుక నేను ఇది చేస్తాను."అబ్రాహాము నా ఆజ్ఞలకు చట్టాలకు, నియమాలకు విధేయుడయ్యాడు."


యోబు గ్రంథము 5:17

7 దేవుడు ఎవరినైతే గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు.


ద్వితీయోపదేశకాండమ 4:40

40 ఈ రోజు నేను మీకు యిచ్చే ఆయన ఆజ్ఞలకు, చట్టాలుకు, మీరు విధేయులు కావాలి. కాబట్టి మీకూ, మీ తరువాత జీవించే పిల్లలకు అంతా శుభం జరుగుతుంది. శాశ్వతంగా మీదిగా ఉండేందుకు మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు దీర్ఝకాలం జీవిస్తారు.


మత్తయి సువార్త 5:11-12

11 ప్రజలు మిమ్మల్ని నా కారణముగా అవమానపరిస్తే లేక మీకు హాని తలపెడితే  అన్యాయముగా చెడు మాటలు పలికితే, లేక హింసిస్తే , మీకు పరలోకమందు గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. 12 ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు.


యిర్మీయా 7:5-7

5 మీరు మీ మీ జీవితాలను మార్చుకొని మంచి పనులు చేస్తే, మిమ్మల్ని ఈ ప్రదేశంలో జీవించేలా చేస్తాను. మీరు ఒకరికొకరు సత్యవర్తనులై మెలగాలి. 6 కొత్తవారి పట్ల న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకులను చంపవద్దు! ఇతర దేవుళ్లను అనుసరించ వద్దు! ఎందువల్లనంటే ఆ దేవతలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. 7 మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని నా ఈ రాజ్యంలో జీవించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను.

అపొస్తలుల కార్యములు 3:26

26 దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళ్ళించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకొన్నాడు.