బాప్తిస్మం
26 యేసు క్రీస్తులో మీరందరూ విశ్వాసం ద్వారా దేవుని కుమారులు.
27 ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు.
మత్తయి సువార్త 28:19-20
19 అందువల్ల అన్ని దేశాలకు వెళ్ళి, వారిని శిష్యులుగా చెయ్యండి. తండ్రి పేరిట, పవిత్రాత్మ పేరిట, కుమారుని పేరిట వారికి బాప్తిస్మము యివ్వండి.
20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నింటిని చేయాలని వారికి చెప్పండి. ఇదుగో నేను ఎల్లప్పుడూ, ఈ లోకం అంతమయ్యేవరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.
1 పేతురు 3:21
21 అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటం వలన దేవుడు మిమ్మల్ని ప్రతిక్షణం రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం పైనున్న మలినాన్ని కడిగి వేయడం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు మరణం నుండి బ్రతికి రావడం వల్ల సంభవిస్తోంది.
అపొస్తలుల కార్యములు 2:38
38 పేతురు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ కోసం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలన్నీ క్షమించబడతాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది.
మార్కు సువార్త 16:16
16 విశ్వసించి బాప్తిస్మము పొందిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. విశ్వసించని వారిని దేవుడు శిక్షిస్తాడు.
యోహాను 3:5
5 అప్పుడు యేసు ఇలా సమాధానం ఇచ్చారు,“ కచ్చితంగా చెబుతున్నాను.
నీరు మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు."
అపొస్తలుల కార్యములు 22:16
16 ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!’ అని అన్నాడు.
రోమీయులకు 6:3
3 బాప్తిస్మము పొందిన మన మందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకొన్నామని మీకు తెలియదా
లూకా సువార్త 3:21
21 యోహాను ప్రజలకు బాప్తిస్మమునిస్తూ వుండినాడు. అప్పుడు వాళ్ళతో సహా యేసుకు కూడా బాప్తిస్మమునిచ్చాడు. యేసు ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది.
22 పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది.“ నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”
1 కొరింథీయులు 12:13
12 శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒకటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు.
13 అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము గ్రీకులమైనా, యూదులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు.
అపొస్తలుల కార్యములు 10:47
47 “ వీరికి బాప్తిస్మము ఇవ్వడానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీరందరూ కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.”
48 వారు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. తరువాత మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారు అతన్ని బతిమాలారు
0 Comments